Online lottery cheating: ఆన్‌లైన్ లాటరీ పేరుతో ఓ యువతిని నమ్మించి.. రూ. 13 లక్షలకు పైగా దోచుకున్నాడు ఓ సైబర్ నేరగాడు. ఇల్లు, పొలం తాకట్టు పెట్టి.. ఉన్నదంతా ఊడ్చి ఇచ్చిన యువతి.. మోసపోయినట్లు తెలుసుకుని.. ఇంట్లో చెప్పలేక సతమతమైంది. చుట్టుపక్కల తెలిస్తే పరువు పోతుందని.. పోలీసులను ఆశ్రయించే ధైర్యం లేక ప్రాణాలు తీసుకునేందుకు యత్నించింది. ఏపీలోని చిత్తూరు(cheating in the name of lottery) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్లో రూ. 2.5 కోట్లు లాటరీ గెలుచుకున్నారంటూ.. ఆ యువతికి డబ్బు వల విసిరిన విదేశీ సైబర్ నేరగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. ఉగాండాకు చెందిన ఆ నిందితుడిని పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు.
Cyber Crime Compliant: 'క్షణాల్లో సమస్య పరిష్కరిస్తామని.. లక్షల్లో కాజేశారు'
లాటరీలో 2.5 కోట్లు వచ్చాయని..
ఆన్‌లైన్ లాటరీ(cheating in the name of lottery in Chittoor)లో రూ.2.5 కోట్లు వచ్చాయని చిత్తూరు జిల్లాకు చెందిన యువతికి గత ఏడాది అక్టోబరులో యుగాండాకు చెందిన నెల్సన్ హూగ్లర్ అలియాస్ జాన్ ఫోన్ చేశాడు. నిజమే అనుకుని నమ్మిన యువతి.. ఆ డబ్బు కావాలని అడిగింది. లాటరీ డబ్బు పొందాలంటే ముందుగా కొంత సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని మోసగాడు నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మన యువతి ఇల్లు, పొలం కుదవపెట్టి దశల వారీగా రూ.13,78,890 నిందితుడి ఖాతాలో జమచేసింది. రోజులు గడుస్తున్నా లాటరీ సొమ్ము రాకపోగా.. అటునుంచి స్పందన కురవైంది. మోసపోయానని గ్రహించిన యువతి.. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు..