తెలంగాణ

telangana

ETV Bharat / crime

The Kashmir Files : 'ది కశ్మీర్ ఫైల్స్'.. సైబర్ కేటుగాళ్ల న్యూ మంత్ర

The Kashmir Files : "ది కశ్మీర్ ఫైల్స్".. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ చూడటం కోసం ఆఫీసులకు సెలవు కూడా ఇస్తున్నారు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని అమాయకులకు వల వేసి మోసం చేసే సైబర్ కేటుగాళ్లు.. ఇప్పుడు "ది కశ్మీర్ ఫైల్స్" సినిమా ట్రెండ్‌ను గుర్తించి దాన్ని కూడా వాడేశారు. ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చంటూ వాట్సాప్‌లో ఓ లింక్‌ ఫార్వార్డ్ చేస్తూ ఆ లింక్‌ క్లిక్‌ చేయగానే ఫోన్ హ్యాక్ చేసి వారి బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు.

The Kashmir Files
The Kashmir Files

By

Published : Mar 21, 2022, 7:44 AM IST

The Kashmir Files: ఆధార్‌ కార్డు, బ్యాంకు కేవైసీ, మెసేజ్‌లు, ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఇలా ప్రతి అంశాన్ని సైబర్‌ మాయగాళ్లు అనుకూలంగా మలచుకుని రూ.లక్షలు కాజేస్తున్నారు. చివరకు కరోనాను కూడా వాళ్లు ఓ అవకాశంగా మలుచుకున్నారు. కరోనా టీకా, కరోనా ఔషధాలు అంటూ అమాయకుల నుంచి డబ్బులు కొట్టేశారు. ఇలా ట్రెండ్‌లో ఉండే ప్రతి విషయం తమకో ఛాన్స్‌ అనుకుని అమాయక ప్రజలకు వల వేసి వాళ్ల కష్టార్జితాన్ని కొల్లగొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్ల దృష్టిలో 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు వస్తున్న హైప్ పడింది. ఇంకేంటి.. ఆ సినిమాను వాడుకుని వల పన్నాలనుకున్నారు.

Cyber Crimes in Telangana : ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగానహన కల్పిస్తున్నారు రాచకొండ పోలీసులు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా లింక్‌ రూపంలో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా వచ్చే సందేశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దిల్లీ, నోయిడాల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ను ఉచితంగా చూడొచ్చంటూ హ్యాకర్లు లింకులు పంపి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఫేస్‌బుక్, ట్విటర్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. మోసపోయినట్టు గుర్తించగానే సైబర్‌ క్రైమ్‌ సహాయ కేంద్రం 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details