నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి ఓ వ్యక్తి నుంచి రూ.2.85 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.10వేలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. దూలపల్లికి చెందిన శ్రీనివాసులు పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి... అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని తన స్నేహితులకు సందేశాలు పంపించారని బాధితుడు తెలిపారు. తన మిత్రుడు శ్యామ్ రెడ్డి రూ.2.85 లక్షలు ఇచ్చినట్లు వాపోయారు. అనంతరం నగదు పంపానని ఫోన్ చేయగా విషయం తెలిసిందని చెప్పాడు.
సైబర్ మాయజాలం.. స్నేహితుల పేరిట అడ్డంగా 'బుక్'! - తెలంగాణ వార్తలు
ఫైస్బుక్ను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి మిత్రులకు సందేశాలు పంపుతున్నారు. డబ్బులు అత్యవసరమంటూ వేడుకుంటున్నారు. మిత్రుడు ఆపదలో ఉన్నాడేమోనని ఏమీ ఆలోచించకుండా డబ్బులు పంపిస్తున్నారు కొందరు. ఆ తర్వాత నిజం తెలిసి తలలు పట్టుకుంటున్నారు.

సైబర్‌నేరాలు, ఫేస్‌బుక్‌తో సైబర్ మోసాలు
అదే జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన దినేష్ రెడ్డిని ఫేస్బుక్లో తన స్నేహితుడి పేరిట సైబర్ నేరగాళ్లు డబ్బులు అడిగారని బాధితుడు తెలిపారు. రూ.30వేలు అడగడంతో రూ.10వేలు ఇచ్చానని చెప్పారు. అనంతరం తన మిత్రుడి ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసినట్లు గుర్తించినట్లు వాపోయారు. పై రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:నదిలో మునిగిన నాటుపడవలు.. 8 మంది గల్లంతు