బహుళ జాతి సంస్థ టీసీఎస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ యువతిని సైబర్ నేరాగాళ్లు బురిడీ కొట్టించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన బాధితురాలి నుంచి రూ.లక్షకుపైగా కాజేశారు. ఉద్యోగం కోసం నౌకరి డాట్ కామ్‌లో ఇటీవల తన వివరాలతో రిజిస్టర్ చేసుకున్నట్లు ఆమె తెలిపారు. తనకు ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు... వివిధ రకాల ఫీజుల పేరిట రూ.లక్షకుపైగా వసూలు చేసినట్లు వాపోయారు.
Cyber crime: టీసీఎస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువతికి టోకరా - తెలంగాణ వార్తలు
సైబర్ కేటుగాళ్లు రోజుకో పంథాలో రూటు మార్చుతున్నారు. నిరుద్యోగుల ఆశలనే అనువుగా మార్చుకొని రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివిన ఎంతోమంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ఉద్యోగం పేరుతో బురిడీ కొట్టించారు.
సైబర్ నేరాలు, సైబర్ మోసాలు
డబ్బు ఇచ్చిన తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Rape: సోదరిపై అత్యాచారం..బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులు