తెలంగాణ

telangana

Bulli Bai APP: ఆ యాప్​లో మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం!

By

Published : Jan 4, 2022, 3:50 PM IST

Bulli Bai App Issue: ఓ వర్గానికి చెందిన మహిళలే లక్ష్యంగా 'బుల్లి బాయ్​' యాప్​ పేరుతో దుండగుల వికృత చేష్టలకు పాల్పడటం చర్చనీయాంశమైంది. బాధిత మహిళలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Bulli Bai App Issue
'బుల్లి బాయ్​'

Bulli Bai App: నూతన సంవత్సర ఆరంభం రోజునే ఓ వర్గానికి చెందిన మహిళల ఆత్మగౌరవాన్ని ఆన్‌లైన్‌ వేలంలో పెట్టిన అకృత్యం వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వంద మందికిపైగా మహిళల చిత్రాలను అభ్యంతరకర రీతిలో మార్చి ఓ యాప్‌లో వేలానికి ఉంచిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.

'బుల్లి బాయ్​' పేరుతో ఉన్న ఆ యాప్‌లో ఓ వర్గానికి చెందిన మహిళల చిత్రాలను అసభ్యకరంగా ఫొటోలు మార్ఫింగ్ చేశారు. బాధిత మహిళలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది జులైలో ‘సుల్లీ డీల్స్‌’ అనే యాప్‌లోనూ మహిళ సామాజిక వేత్తల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి... అసభ్య పదజాలంతో కేటుగాళ్లు వైరల్ చేశారు.

ఇప్పుడు బుల్లి బయ్ యాప్​తో ఇలాగే చేస్తున్నారు. వేధింపులు తాళలేక టోలిచౌక్​కి చెందిన బాధిత మహిళ సామాజిక వేత్త, రాజేంద్రనగర్​కు చెందిన మరో మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:మహిళల వేలం పేరుతో వికృత చేష్టలు.. ఆ యాప్‌ బ్యాన్!

ABOUT THE AUTHOR

...view details