Cyber Fraud: ఏపీ మహేశ్ బ్యాంక్ సర్వర్లోకి చొరబడి 12కోట్ల రూపాయలకు పైగా కాజేసిన కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది నైజీరియన్ల పనేనని తేల్చారు. శనివారం రాత్రి మహేశ్‌బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి ఆదివారం సాయంత్రం వరకూ నగదు బదిలీ చేశారని గుర్తించారు. బ్యాంక్ ఖాతాదారులకు, ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన నగదును సరిచూసుకునేందుకు బ్యాంక్ సిబ్బంది ప్రయత్నించగా.. ఈ సైబర్‌దాడి బయటపడింది. వెంటనే బషీర్‌బాగ్‌లోని సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన సైబర్‌క్రైమ్ పోలీసులు.. మూడు కోట్ల రూపాయల వరకు నేరగాళ్ల చేతికి చిక్కకుండా కాపాడగలిగారు. ఈ మొత్తం వ్యవహారంలో ఖాతాదారుల వివరాలేవీ నేరగాళ్ల బారిన పడలేదని.. వాళ్లు వాటి జోలికి పోలేదని మహేశ్ బ్యాంక్ డీజీఎం బద్రీనాథ్ తెలిపారు.
నిర్వహణ సరిగ్గా లేని సర్వర్లను గుర్తించి..
ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకులు ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఖాతా నిర్వహణ, నగదు జమ, ఉపసంహరణ అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. వేల మంది ఖాతాదారుల సమాచారం, లావాదేవీలన్నింటి కోసం బ్యాంకు నిర్వాహకులు సర్వర్లను నిర్వహిస్తున్నారు. ఈ సర్వర్లు హ్యాక్ కాకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దపెద్ద బ్యాంకుల సర్వర్ల నిర్వహణ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కానీ సహకార బ్యాంకుల టర్నోవర్ తక్కువ మొత్తంలో ఉంటుంది. వందల కోట్లు ఖర్చు చేసి సర్వర్లను నిర్వహించడానికి యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. దీంతో సైబర్ నేరగాళ్లు సర్వర్లను హ్యాక్ చేయడంలో సఫలమవుతున్నారు. నిర్వహణ సరిగ్గా లేని సర్వర్లను గుర్తించి వాటిని హ్యాక్ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
జాగ్రత్తలు తీసుకోవాలి..