Cyber Crimes in hyderabad: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 చరవాణులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు.
ఉద్యోగాల పేరిట..
దిల్లీలోని మయూర్ విహార్లో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న నిందితులు... వివిధ జాబ్ సైట్లలో నిరుద్యోగుల వివరాలు సేకరించి... వారికి ఫోన్ చేసి ఉద్యోగావకాశం కల్పిస్తామని నమ్మిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు, డిపాజిట్ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు. ఓ యువతికి ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి విడతల వారీగా రూ. 8 లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దిల్లీకి వెళ్లి ముఠాను అరెస్ట్ చేశారు.