తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2021, 9:50 AM IST

ETV Bharat / crime

FAKE WEBSITES: అక్షరంతో ఏమార్చి.. అయినకాడికి దోచి

విహార యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అందుకోసం అంతర్జాలంలో వెతుకుతున్నారా? అయితే అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మీ డబ్బులు స్వాహా ఖాయమని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మాయ చేస్తున్నట్లుగా వివరిస్తున్నారు.

FAKE WEBSITES
FAKE WEBSITES

తన కుటుంబ సభ్యులకు చెందిన పాస్‌పోర్టుల పునరుద్ధరణ కోసం మల్లంపేట్‌కు చెందిన మహిళ(44) ఆన్‌లైన్‌ (FAKE WEBSITES)లో దరఖాస్తు చేసింది. బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.8485 డెబిట్‌ అయ్యాయి. ఎలాంటి రశీదు రాలేదు. స్లాట్‌ బుక్‌ అయినట్లు కూడా సమాచారం రాకపోవడంతో అనుమానమొచ్చి దుండిగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీయగా అది నకిలీ ‘పాస్‌పోర్టు’ వెబ్‌సైట్‌ (FAKE WEBSITES) అని తేలింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లు (FAKE WEBSITES) వందల్లో ఉన్నట్లు సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.


నిరుద్యోగులే లక్ష్యంగా..

అసలు వెబ్‌సైట్ల మాదిరిగానే స్వల్ప మార్పులు చేసి నకిలీ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)ను తయారు చేస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే తప్ప తేడా గుర్తించలేం. ఈ తరహా నకిలీ వెబ్‌సైట్లతో మొదట్లో నిరుద్యోగులకు టోకరా వేయడం మొదలు పెట్టారు. నౌకరీలైవ్‌.కామ్‌, నౌకరీఇండియా.కామ్‌, నౌకరీస్‌.కామ్‌, షైన్‌లైవ్‌.కామ్‌, షైన్‌ఇండియా.కామ్‌. పేరిట నకిలీ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)ను సృష్టించి.. ఆ లింక్‌ను నిరుద్యోగులకు పంపుతున్నారు. కొందరేమో బ్యాంక్‌ ఖాతా వివరాలిచ్చి.. అందులో ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతరత్రా ఛార్జీలను జమ చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరేమో రూ.11 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటున్నారు. అక్కడే పోర్టల్‌లోనే ఓటీపీ సాయంతో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు సార్లు లావాదేవీలు ఫెయిల్‌ అయినట్లు వస్తుంది. ఆ తర్వాత ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమవుతుందని పోలీసులు వివరిస్తున్నారు.


ఆఫర్లే.. ఆఫర్లు అంటూ..

కరోనాతో ఎక్కువ మంది నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కేటుగాళ్లు తదితర ప్రాచుర్యం పొందిన ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)కు నకిలీవి రూపొందించి ఆన్‌లైన్‌లో పెట్టేశారు. మార్కెట్‌ ధరతో పోల్చితే 50 శాతం తక్కువకు ఇస్తామంటూ.. విస్తృతంగా ప్రకటనలిస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువులు డెలీవరీ చేయడం లేదు. అప్పుడు మోసపోయినట్లు తెలుసుకుని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఈ తరహాలోనే ‘డెక్‌అప్‌.కామ్‌’, ‘జాప్‌నౌ.ఇన్‌’ ‘మాడ్‌వేఫర్నీచర్‌.కో.ఇన్‌’ పేరిట నకిలీ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)ను రూపొందించి నిండా ముంచుతున్న రిషభ్‌ ఉపాధ్యాయ్‌(30)ని ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు బెంగళూరులో అరెస్ట్‌ చేశారు.


ఎక్కడి నుంచి చేస్తున్నారంటే...

ఈ-కామర్స్‌, రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)కే పరిమితం కాలేదు. ముఖ్యంగా పాస్‌పోర్టు సేవలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు సంబంధించి పదుల సంఖ్యలో నకిలీ వెబ్‌సైట్లు (FAKE WEBSITES) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీ, నోయిడా, గుడ్‌గావ్‌ తదితర ప్రాంతాల నుంచే ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. అక్కడ నేరగాళ్లు వివిధ పేర్లతో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. లోపలికెళ్లే వరకు కూడా అది కాల్‌ సెంటర్‌ అని ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఒకటి, రెండు నెలలకోసారి అక్కడి నుంచి మకాం మారుస్తున్నారు.


50 శాతం చెల్లించాలంటూ..

రోజుకో తరహాలో కేటుగాళ్లు జేబులకు చిల్లులు పెడుతున్నారు. తాజాగా విహారయాత్రలకు సంబంధించి నకిలీ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)ను సృష్టించి అంతర్జాలంలో పెడుతున్నారు. చూడగానే ఆకట్టుకునే పేర్లతో అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ సంస్థలకు సంబంధించిన వెబ్‌సైట్ల (FAKE WEBSITES) మాదిరిగానే ఒక అక్షరం అటు.. ఇటు మార్చి పెడుతున్నారు. ఈ తరహాలోనే కొండాపూర్‌కు చెందిన బాధితుడు రూ.76 వేలు మోసపోయాడు. బుకింగ్‌ కోసం ఔత్సాహికులు గూగుల్‌లో వెతికి.. అక్కడున్న కస్టమర్‌ కేర్‌ నంబర్లకు కాల్‌ చేస్తున్నారు. అవతలివైపు వ్యక్తులు కొటేషన్‌ పంపిస్తున్నారు. ఏదో ఒకటి ఎంపిక చేసుకోమంటున్నారు. ఆ తర్వాత 50 శాతం అడ్వాన్స్‌ కట్టాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విమాన టిక్కెట్లు, ఫొటోలతో..

అడ్వాన్స్‌ చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని కూడా చాలా తెలివిగా స్వాహా చేస్తున్నారు. విహారయాత్రకు వెళ్లాలనుకునే వారి పేర్ల మీద విమాన టిక్కెట్లు బుక్‌ చేసి మెయిల్‌లో పంపిస్తున్నారు. అలాగే ఖరీదైన హోటల్స్‌లో బస ఏర్పాట్లు, ప్రత్యేక వాహనం తదితర ఏర్పాట్లపై ఫొటోలు వాట్సాప్‌లో షేర్‌ చేస్తున్నారు. మిగిలిన మొత్తం చెల్లిస్తేనే బుకింగ్‌ కన్ఫార్మ్‌ అవుతుందంటూ నమ్మబలుకుతున్నారు. తీరా.. యాత్రకు బయలుదేరే ఒకటి, రెండ్రోజుల ముందు నుంచి ఆ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుంది. విమాన టిక్కెట్ల గురించి ఆన్‌లైన్‌లో ఆరా తీస్తే క్యాన్సిల్‌ అయినట్లు వస్తుండటంతో అప్పుడు మోసపోయినట్లుగా బాధితులు తెలుసుకుంటున్నారు. బాధితుల్లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉంటున్నారని, అయితే చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు.

ఇదీ చూడండి:Sexual Harassment on a Minor Girl : ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారయత్నం

లా స్టూడెంట్​ది కిడ్నాప్​ కాదు.. అరెస్టు చేశాం: పోలీసులు

Cyber crimes Types: ఫెస్టివల్ ఆఫరా.. స్పెషల్ గిఫ్ట్ వచ్చిందా? కాస్త ఆలోచించండి!

Fake Facebook Account : ఆ బూచోళ్లు చివరికి సీఎం సీపీఆర్వోనూ వదల్లేదుగా?

ABOUT THE AUTHOR

...view details