తెలంగాణ

telangana

ETV Bharat / crime

సైబర్​ మోసం: ద్విచక్రవాహనం అమ్ముతానని నమ్మించి.. - మేడ్చల్ జిల్లా వార్తలు

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో సైబర్ మోసం వెలుగుచూసింది. ఆన్​లైన్​లో ద్విచక్రవాహనం అమ్ముతున్నట్లు నమ్మించి నగదు బదిలీ చేయించుకున్నారు ఓ కేటుగాడు. వాహనం రాకపోవడంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

fake bike sale in facebook
జీడిమెట్లలో సైబర్ మోసం

By

Published : Apr 2, 2021, 1:49 PM IST

ఆన్​లైన్​లో ద్విచక్రవాహనం అమ్మకం పేరుతో సైబర్ మోసానికి తెరదీశాడు ఓ కేటుగాడు. ఫేస్​బుక్​లో ప్రకటన ఇచ్చి నగదు బదిలీ చేయించుకుని టోకరా వేశాడు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని చెరుకుపల్లి కాలనీకి చెందిన రాజేందర్(36) రూ.63,300 చెల్లించినా వాహనం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్మీ ఉద్యోగానికి వెళ్తున్నానని...

తాను ఆర్మీలో ఉద్యోగానికి వెళ్తున్నానని... అందుకే తన యాక్టీవా వాహనాన్ని అమ్ముతున్నట్లు బాధితునికి ఫోన్​లో తెలిపి సైబర్ నేరగాడు తన ఫేక్ ఐడీ కార్డులను అతనికి పంపించాడు. అది నమ్మిన రాజేందర్ పలు విడతలుగా నగదు బదిలీ చేశారు. వాహనం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: పిల్లలపై కర్కశంగా వ్యవహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details