తెలంగాణ

telangana

ETV Bharat / crime

షార్జా నుంచి 9 ఐఫోన్​లు తెచ్చాడు.. ఎయిర్​పోర్ట్​లో అధికారులు సీజ్​ చేశారు! - శంషాబాద్​ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లు పట్టివేత

శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న ఐఫోన్​-13 సహా బంగారం బిస్కెట్లు తీసుకొచ్చిన ప్రయాణికులపై కస్టమ్స్​ అధికారులు కేసులు నమోదు చేశారు. 9 ఐఫోన్​-13 ఫోన్లు, మూడు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Customs seizures in Shamshabad airport
ఐఫోన్​-13

By

Published : Nov 22, 2021, 9:06 PM IST

Updated : Nov 22, 2021, 9:45 PM IST

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్‌ -13 ప్రో మోడల్‌ ఫోన్‌లను అక్రమంగా తెస్తున్న ప్రయాణికుడిపై శంషాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు. షార్జా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి లగేజి తనిఖీ చేయగా.. అందులో తొమ్మిది లేటెస్ట్‌ మోడల్‌ ఐఫోన్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని సీజ్​ చేశారు. వీటి విలువ సుమారు రూ.8.37లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో ముగ్గురు మహిళా ప్రయాణికులపై కస్టమ్స్​ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.29 లక్షలకుపైగా విలువైన విదేశీ కరెన్సీ, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.11.49 లక్షల విలువ 55 వేల యూఏఈ దిరమ్స్‌, 970 యూఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో మహిళ ప్రయాణికురాలి నుంచి రూ.17.69 లక్షలు విలువ చేసే మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

gold biscuts

గతవారం..

నవంబర్​ 14న శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో లక్షల రూపాయలు విలువ చేసే బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడి నుంచి రూ.34 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్​కు ఈ బంగారాన్ని తరలిస్తుండగా సీజ్ చేశామని అధికారులు తెలిపారు.

జ్యూసర్ కడ్డీల రూపంలో..

ఎయిర్​పోర్టులో ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జ్యూసర్‌లో కడ్డీల రూపంలో బంగారాన్ని అమర్చి.. తీసుకెళ్లడానికి యత్నించాడని అధికారులు తెలిపారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీచూడండి:

Last Updated : Nov 22, 2021, 9:45 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details