Hyderabad Pub Case: బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఈనెల 14న నిందితులు అభిషేక్, అనిల్‌ను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఠాణాకు తీసుకువచ్చిన పోలీసులు.. వివిధ కోణాల్లో ప్రశ్నించారు. పబ్‌లో పోలీసులకు లభ్యమైన కొకైన్కు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు చెబుతున్నారు. అభిషేక్ ఐ ఫోన్లో కీలక డేటా ఉంటుందని భావించిన పోలీసులు.. దర్యాప్తులో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలను, ఫోన్ కాల్స్‌ను, వాట్సాప్ సందేశాలను గుర్తించలేదు.
పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగిన నిందితులు నోరు మెదపడం లేదు. పబ్‌లో స్వాధీనం చేసుకున్న 4.64 గ్రాముల కొకైన్కు తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు. పోలీసులు రైడ్ చేస్తున్నారు అన్న సమాచారంతో కస్టమర్లు ఎవరో పడేశారని బదులిస్తున్నారు. తమకు కస్టమర్లకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు మాత్రమే పామ్ అనే సాఫ్ట్వేర్ వాడినట్టు అభిషేక్ పోలీసులకు తెలిపాడు.