తెలంగాణ

telangana

ETV Bharat / crime

Marijuana cultivation at Home: ఇంటి ఆవరణలో గంజాయి సాగు.. నిందితులను పట్టిస్తున్న గాంజా కంపు - marijuana cultivation in jawahar nagar

ఆహ్లాదం కోసం ఇంట్లో మొక్కలు పెంచుతారు కొందరు. ఆరోగ్యం కోసం కురగాయలు, పండ్ల మొక్కలు పెంచుతారు మరికొందరు. కానీ.. కాసులకు కక్కుర్తి పడి, మత్తుకు బానిసైన కొందరు ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు(Marijuana cultivation at Home in medchal district) పెంచుతున్నారు. ఇంట్లోనే పెంచుతున్నాం కదా.. ఎవరికీ తెలియదని అనుకుంటున్నారు. కానీ.. గుప్పుమనే గంజాయి కంపు.. ఏపుగా పెరిగే మొక్కలు ఇరుగుపొరుగు వారి కంటపడతున్నాయి. వారిచ్చే సమాచారంతో చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యేలా చేస్తున్నాయి.

Marijuana cultivation at Home
Marijuana cultivation at Home

By

Published : Nov 11, 2021, 1:21 PM IST

ఇంటి ఆవరణలో మొక్కలు పెంచితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అవే మొక్కలు కూరగాయలో, పండ్లో అయితే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది. కానీ.. కక్కుర్తి పడి గంజాయి మొక్కలు(Marijuana cultivation at Home in medchal district) పెంచితే.. ఏమవుతారు. కటకటాలపాలవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో గంజాయి(Marijuana usage prevention in Telangana)పై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన రోజు నుంచి రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ఎక్కడికక్కడ గంజాయి తరలింపును అడ్డుకుంటున్నారు.

Marijuana cultivation at Home

వ్యసనంగా మారుతున్న అలవాటు

గంజాయి తరలింపు(Cannabis transport prevention)ను కట్టడి చేయడానికి చెక్​పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు భారీగా గంజాయి పట్టుబడింది. గాంజాపై అధికారులు చర్యలు ప్రారంభించడంతో వారికి పట్టుబడతామనే భయంతో కొందరు ఈ దందాను కొన్నిరోజుల వరకు మానేశారు. కానీ ఈ ఆకులకు అలవాటైన వారు మరో కొత్త తప్పు చేయడానికి పురిగొల్పింది. గంజాయిని తరలిస్తుంటే.. పోలీసులు అడ్డుకుంటున్నారనే.. ఇంట్లోనే మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. గాంజాకు బానిసైన వారు ఓవైపు.. మరోవైపు వారి అలవాటును ఆసరా చేసుకుందామనుకున్న వారు ఇంటి ఆవరణలో, పూలకుండీల్లో, పంట మధ్యలో గాంజా సాగు చేస్తున్నారు.

ఇంటి ఆవరణలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్క

పక్కా సమాచారంతో దాడులు

తెలంగాణ పోలీసులు ఫోకస్ చేస్తే.. ఏ మూలన దాగున్నా దొంగ దొరకాల్సిందే అన్నట్లు.. వాహనాల్లో తరలిస్తున్న వారినే కాదు.. ఇంటి ఆవరణలో సాగు చేస్తున్న వారిపైనా తమ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారు ఖాకీలు. ఇన్​ఫార్మర్​ల సాయంతో.. ఇరుగుపొరుగు వారందిస్తున్న సమాచారంతో.. స్వతహాగా వారే రెక్కీ నిర్వహించి.. ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా సమాచారం అందుకుని పక్కాగా దాడులు చేస్తున్నారు. గంజాయి సాగు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఇంట్లోనే గంజాయి సాగు

తాజాగా.. మేడ్చల్ జిల్లాలోని జవహర్​నగర్​లో పోలీసులు గంజాయి మొక్కలను(Marijuana cultivation at Home in medchal district) గుర్తించారు. అరుంధతినగర్​లో అయాజ్​ఖాన్ అనే వ్యక్తి తాను అద్దెకుంటున్న ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచాడు. స్థానికుల సమాచారంతో అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు కనిపించాయి. వాటిని తొలగించి ధ్వంసం చేశారు. ఆ మొక్కల బరువు 4 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయాజ్ ఖాన్​ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని వెల్లడించారు.

పూలకుండీల్లో గంజాయి మొక్కలు

ఇటీవలే.. సికింద్రాబాద్ యాప్రాల్​లోని ఓ ఇంట్లోనూ గంజాయి మొక్కలు(Marijuana cultivation at Home in medchal district) పెంచడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ ఇంటిపై దాడి చేసి పూలకుండీల్లో పెంచుతున్న మొక్కలను ధ్వంసం చేశారు. గాంజాను సాగుచేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ మొక్కలను ఎవరి కోసం పెంచుతున్నాడు? ఎక్కడికి తరలిస్తాడు అనే విషయాలను ఆరా తీసిన పోలీసులు ఆ వ్యక్తి చెప్పిన సమాధానాలు విస్తుపోయేలా చేశాయి. రాత్రి నిద్ర పట్టడం లేదని.. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడం వల్ల తనకు తెలిసిన వ్యక్తి గంజాయి తాగితే మంచి నిద్ర వస్తోందని చెప్పాడని విచారణలో పోలీసులకు నిందితుడు తెలిపాడు. అలా ఇంట్లోనే మొక్కలు పెంచి.. తాను మాత్రమే దాన్ని వినియోగిస్తున్నానని చెప్పాడు. ఈ విషయాలు విన్న పోలీసులు ఆ వ్యక్తిది అమాయకత్వమో.. అతితెలివో అర్థంగాక విస్తుపోయారు.

ABOUT THE AUTHOR

...view details