తెలంగాణ

telangana

ETV Bharat / crime

సీసీ కెమెరాలతో క్రైం రేటు తగ్గింది: సీపీ మహేశ్ భగవత్​

మల్కాజ్​గిరిలోని పలు కాలనీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను.. ఎమ్మెల్యే మైనంపల్లి, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సీఎం కేసీఆర్​ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలతో.. దొంగతనాలు, నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని వివరించారు ఎమ్మెల్యే.

cc cameras
రాచకొండ సీపీ మహేష్ భగవత్

By

Published : Apr 12, 2021, 4:19 PM IST

నేరాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తోన్న సీసీ కెమెరాలను.. ప్రతి కాలనీలో ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ కోరారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్​గిరిలో దాతల సాయం.. రూ. 32 లక్షలతో ఏర్పాటు చేసిన 154 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. కెమెరాల ఏర్పాటుతో.. నేరాలు చాలా వరకు తగ్గాయని వివరించారు.

పేదలు నివసించే కాలనీల్లో.. సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒక్క సీసీ కెమెరా.. 100 మంది పోలీసులతో సమానమని వివరించారు. దాతలు ముందుకు వచ్చినట్లే.. నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:సరికొత్త సైబర్ ‌ఎత్తుగడలు.. యువతులతో ఫోన్లు చేయిస్తున్న నేరస్థులు

ABOUT THE AUTHOR

...view details