ప్రియుడు మోసం చేశాడన్న మనస్తాపంతో.. టాలీవుడ్‌కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య (Junior Artist Suicide News )చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే...
ప్రియుడు మోసం చేశాడన్న మనస్తాపంతో.. టాలీవుడ్‌కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య (Junior Artist Suicide News )చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే...
కుత్బుల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) మూడు నెలలుగా కిరణ్ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తోంది. ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు.
బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు తెలియకుండా కిరణ్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకనే తన సోదరి తనువు చాలించిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడైన కిరణ్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:ATTACK ON YOUNG WOMAN: ప్రేమోన్మాదం.. యువతిపై యువకుడి కత్తి దాడిపు చేపట్టారు