తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్రికెట్ బుకీ అరెస్టు.. 10 లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం - మలక్‌పేట్‌ కేంద్రంగా బెట్టింగ్‌

క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న రాజేశ్‌ అనే బుకీని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10.16 లక్షల నగదు, 5 ఫోన్లు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లోని మలక్‌పేట్‌ కేంద్రంగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

cp mahesh bhagwat, Cricket bookie arrested malakpet
క్రికెట్ బుకీ అరెస్టు.. 10 లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం

By

Published : Apr 23, 2021, 5:01 PM IST

Updated : Apr 23, 2021, 6:13 PM IST

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న రాజేష్‌ అనే వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10.16 లక్షల నగదు, ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన పోలీసులు... 11 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్, ఇండస్ ఇండ్​ బ్యాంక్ ఖాతాల్లోని రూ.19.89లక్షల నిల్వలను స్తంభింపచేసినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. నగదు, బ్యాంకు ఖాతాల్లోని నిల్వలు మొత్తం కలిపి రూ.30.55 లక్షలు విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు వివరించారు.

మిర్యాలగూడకు చెందిన బంటు రాజేష్‌... హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ కేంద్రంగా రాష్ట్రంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇతనే తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజర్ అని వెల్లడించారు. ఇతనితో ఎవరికి సంబంధాలు ఉన్నాయన్న అంశంపై ఆరా తీస్తున్నామని... కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు మహేశ్‌ భగవత్‌ వివరించారు.

ఇదీ చూడండి :3లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

Last Updated : Apr 23, 2021, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details