తెలంగాణ

telangana

ETV Bharat / crime

Credit Card Fraud క్రెడిట్ కార్డు లిమిట్ 45వేలు, కొట్టేసింది 41 లక్షలు - క్రెడిట్ కార్డు ఫ్రాడ్

Credit Card Fraud ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు రుణపరిమితి రూ.45వేలు ఉంటే అతను రూ.41.69 లక్షలు వాడుకున్నాడు. మరో వ్యక్తి రూ.90 వేల క్రెడిట్ లిమిట్ ఉంటే.. రూ.26.58 లక్షలు లాగేశాడు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బందికి ఇదెలా సాధ్యమైందో అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు. చేసేదేం లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

Credit Card Fraud
Credit Card Fraud

By

Published : Aug 17, 2022, 9:20 AM IST

Credit Card Fraud : క్రెడిట్‌ కార్డు రుణ పరిమితి రూ.45 వేలు. కార్డుదారు ఏకంగా రూ.41.69 లక్షలు వాడుకున్నాడు. ఇంకో వ్యక్తి క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.90 వేలుంటే.. రూ.26.85 లక్షలు లాగేశాడు. బ్యాంకు సిబ్బందికి అంతుబట్టక సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. గచ్చిబౌలిలోని ఓ బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు క్రెడిట్‌ కార్డులు తీసుకున్నారు. వీరు కార్డుల పరిమితికి మించి రూ.68.55 లక్షలు వాడుకున్నారు.

వాస్తవానికి రెండు కార్డుల రుణ పరిమితి రూ.1.35 లక్షలే. బ్యాంకు సిబ్బంది ఈ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. కార్డుదారులను సంప్రదించేందుకు సిబ్బంది ప్రయత్నించగా, ముందుఇచ్చిన చిరునామాలో అందుబాటులో లేరు. బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశారు.

మరోవైపు.. క్రెడిట్​, డెబిట్​ కార్డుల మోసాలు, ఛార్జీల మోత నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా సిద్ధమైంది. కార్డుల జారీపైకొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని 2022 జులై 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిబంధనలతో వినియోగదారులకు రక్షణతో పాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది.

క్రెడిట్‌ కార్డుల విషయంలో ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తూనే ఉంటుంది. వీటివల్ల కార్డుల వినియోగంలో పారదర్శకత ఉండాలని, వినియోగదారుల హక్కులు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. తాజాగా తీసుకొచ్చిన కొన్ని మార్పులు జూన్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వాటి గురించి ఒకసారి పరిశీలిద్దాం. కార్డు వినియోగదారులతోపాటు, ఆ క్రెడిట్‌ కార్డులను జారీ చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకూ కొన్ని బాధ్యతలను ఆర్‌బీఐ కొత్త నిబంధనల్లో స్పష్టంగా తెలియజేసింది. కార్డు నిర్వహణలో లోపాలకు కార్డులను జారీ చేసే సంస్థలకూ జవాబుదారీతనం ఉందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details