పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీపీఎం నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రశాంత్ నగర్లో ఉండే బండారి మొగిళిని రాత్రి ఇంటి నుంచి మాట్లాడే పనుందని అదే కాలనీకి చెందిన ఇద్దరు యువకులు తీసుకెళ్లారు. ట్యాంక్ బండ్ వద్ద గొంతు నులిమి హత్య చేశారు.
సీపీఎం నేత దారుణ హత్య.. భూ తగాదాలే కారణం - peddapalli crime news
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో సీపీఎం నాయకున్ని ఇద్దరు యువకులు గొంతు నులిమి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీపీఎం నేత దారుణ హత్య.. భూ తగాదాలే కారణం
మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ రమేష్ హత్య జరిగిన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థల వివాదం పై గత కొన్ని రోజులుగా గొడువలు జరుగుతున్నాయని మృతిని కుమారుడు తెలిపారు.
ఇదీ చదవండి:కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్