CP Stephen Ravindra Press Meet: బ్యాంక్ అధికారులమని.. అమాయకులకు ఫోన్లు చేసి.. వారి ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తున్న ముఠాను సైబర్‌బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్‌ను దిల్లీలో గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. అతిపెద్ద సైబర్ మోసాన్ని ఛేదించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కాల్‌సెంటర్‌పై దాడి చేసి రెండు ముఠాలను అరెస్ట్ చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
దిల్లీలో ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డారు. ఏడాదిలోనే ఈ ముఠా దేశవ్యాప్తంగా 33 వేల ఫోన్లు చేశారు. ఈ కాల్‌సెంటర్ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదయ్యాయి. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాలు సేకరించేవారు. 1860 180 1290 అనే నంబరు నుంచి ఫోన్ చేసి.. కార్డుల వివరాలు సేకరించి.. డబ్బులు కొల్లగొట్టేవారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫర్మాన్ హుస్సేన్. స్పూఫింగ్ అప్లికేషన్ల ద్వారా ఖాతాదారుల నగదు లూటీ చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా వందల కోట్లు మోసం చేసి ఉండొచ్చు.
'ధని లోన్ బజార్' పేరుతో రుణాలు ఇప్పిస్తామని మరో మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ యాప్ తయారు చేసి ముఠా మోసాలకు పాల్పడుతుంది. రుణం వచ్చిందని చెప్పి అధిక మొత్తంలో రుసుమలు వసూలు చేయడమే ఈ ముఠా లక్ష్యం. ద లోన్ ఇండియా, ధని లోన్ బజార్, పైసా లోన్ హబ్ పేరిట మోసాలకు పాల్పడ్డారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి వివరాలు తీసుకుంటారు. లోన్ వచ్చిందని ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేసేవారు. ఈ కేసులో 14 మందిని అరెస్టు చేశాం. అరెస్టు అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 17 సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం.