CP FAKE WHATSAPP: సైబర్ నేరగాళ్లు పోలీసు ఉన్నతాధికారులనూ వదలడం లేదు. ఉన్నతాధికారుల ఫొటోలు ఉపయోగించుకుని నకిలీ ఖాతాలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఫొటోను ప్రొఫైల్‌పిక్‌గా పెట్టుకుని నకిలీ వాట్సాప్ సృష్టించారు. ఈ నంబర్ నుంచి కొంతమంది అధికారులకు సందేశాలు పంపించారు.
పోలీసులకూ తప్పని ఫేక్ కష్టాలు.. సీపీ పేరిట నకిలీ వాట్సాప్ అకౌంట్ - తాజా నేర సమాచారం
CP FAKE WHATSAPP: సామాన్యుడు నుంచి పోలీసు అధికారులకు కూడా సైబర్ నేరగాళ్ల తలనొప్పి వదలడం లేదు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ సృష్టించారు. వెంటనే స్పందిన సీపీ ఆ నంబర్‌తో వచ్చే ఎటువంటి సందేశాలను నమ్మవద్దని తెలిపారు.

రాచకొండ సీపీ మహేశ్ భగవత్
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. తన పేరిట నకిలీ వాట్సాప్ ఏర్పాటు చేశారని ఆ నంబర్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించొద్దని మహేశ్ భగవత్ కోరారు. ఇప్పటికే ఆ నంబర్‌ను రిపోర్టు చేస్తూ వాట్సాప్‌కు సందేశాలు వెళ్లాయి. వెంటనే బ్లాక్ చేయాల్సిందిగా వాట్సాప్ ప్రతినిధుల దృష్టికి రాచకొండ ఐటీ విభాగం అధికారులు తీసుకెళ్లారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 26, 2022, 4:44 PM IST