హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా ఎక్కువగా జరుగుతుంది: సీవీ ఆనంద్ Huge Supply Of Drugs To Hyderabad: ముంబయిలో కొన్ని ముఠాలు యువతులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వారిపై లైంగిక దాడి చేస్తున్నారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాల సరఫరా ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యవహారంలో గోవా పోలీసులు ఎటువంటి సాయం కూడా చేయలేదని సీపీ వెల్లడించారు.
CV Anand Said a Huge Supply Of Drugs To Hyderabad: ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మాదక ద్రవ్యాల ముఠాపై ముంబయి పోలీసులకు సమాచారమిచ్చామని సీసీ పేర్కొన్నారు. ముంబయి పోలీసుల సాయంతో అక్కడ కూడా దాడులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
వీరి నుంచి 204 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏను, ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ముంబయిలో ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి మరో గ్యాంగ్‌ను అరెస్టు చేశామని చెప్పారు. ఏపీ నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తుండగా వారిని పట్టుకున్నామన్నారు. వీరి నుంచి 110 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో భార్యాభర్తలిద్దరు పరారయ్యారని వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
CM KCR Meeting On Drugs Issue: ఇదివరకే సీఎం కేసీఆర్ డ్రగ్స్ నియంత్రణపై తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు రావాలని సీఎం ఆదేశించారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో సమావేశంలో కార్యాచరణను రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమర్థవంతంగా జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుందని కేసీఆర్ తెలిపారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్ఠంగా అమలు చేసిందని సీఎం వివరించారు.
'ముంబయి.. ఇప్పుడు డ్రగ్స్‌కు అడ్డాగా మారింది. డ్రగ్స్ వ్యవహారంలో గోవా పోలీసులు సాయం చేయలేదు. డ్రగ్స్ ముఠాపై ముంబయి పోలీసులకు సమాచారమిచ్చాం. ముంబయి పోలీసుల సాయంతో అక్కడ కూడా దాడులు చేస్తాం. ఒక గ్రాము రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.7వేలకు అమ్ముతారు. ముంబయిలో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడి చేస్తున్నారు. నిందితుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏ, కారు స్వాధీనం చేసుకున్నాం. ముంబయిలో మరో ముఠాను అరెస్ట్ చేశాం. ఏపీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నాం'. -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
ఇవీ చదవండి: