రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ వేణుబాబు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసు మృతి పట్ల సీపీ అంజనీ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు.
కానిస్టేబుల్ మృతి పట్ల సీపీ సంతాపం - ప్రమాదంలో పోలీసు మృతి
విధి నిర్వాహణలో ప్రమాదానికి గురైన ఓ కానిస్టేబుల్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సీపీ అంజనీ కుమార్.. పోలీసు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మీర్ చౌక్ పీఎస్కు చెందిన వేణుబాబు.. విధి నిర్వాహణలో భాగంగా అమీర్ పేట్ వైపునకు వెళ్తున్నాడు. పంజాగుట్ట వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం వేణుబాబు కన్ను మూశాడు. పెళ్లి రోజు నాడే ప్రమాదానికి గురై.. తనువు చాలించాడంటూ మృతుడి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి:ఆత్మహత్యాయత్నం.. తల్లీ కొడుకులను కాపాడిన హోంగార్డు