Cow Brutally Raped in Yanam: గంజాయి మత్తులో మదమెక్కి.. మతితప్పి, మానవత్వం మరచిన కొందరు పైశాచికంగా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ మూగజీవి తనువు చాలించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పొగాకు ఈశ్వరరావు అనే రైతు స్వగృహానికి సమీపంలోని.. తన కొబ్బరి తోటలో ఆవుల కోసం ప్రత్యేకంగా పశువుల పాక ఏర్పాటు చేశాడు.
ప్రతీ రోజులాగే మేత కోసం ఆవులను పొలాల్లోకి తీసుకుపోయాడు. సాయంత్రానికి యదావిధిగా తిరిగి కొబ్బరి తోటలోని పాకకు ఆవులను చేర్చుతాడు. ఈ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో.. అటుగా వెళ్తున్న కొందరు దుర్మార్గులకు ఆ పశువుల శాల కనిపించింది. వారితో పాటు తెచ్చుకున్న మత్తుపానీయాలను సేవించేందుకు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపించింది. చుట్టు పక్కల జనజీవనం ఏమీ లేదు. ఇంకేముంది వారి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.