కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండెపల్లి గ్రామ సమీపంలో ఆదివారం పశువులు మేత మేస్తున్నాయి. పొదల మాటున దాగున్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో ఓ ఆవు మృతి చెందింది. పులిని చూసి బెదిరిపోయిన మిగతా ఆవులన్నీ పారిపోయాయి.
ఆవుల మందపై పులి దాడి.. ఘటనలో ఓ ఆవు మృతి - tiger attacked on cow at penchikalapeta
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక ఆవు మృతి చెందింది.
ఆవుల మందపై పులి దాడి.. ఘటనలో ఓ ఆవు మృతి
మృతి చెందిన ఆవు గుండెపల్లి గ్రామానికి చెందిన మాడావి తిరుపతికి చెందినదిగా గుర్తించారు. గ్రామ సమీపంలో పులి దాడి జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు