తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లాక్​లో కోవిఫోర్​ విక్రయం.. రిమాండ్​కు నిందితులు - covifore tablets selling in black market in boduppal hyderabad

కరోనా రోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. హోల్​సేల్​ ధరకు కరోనా​ మందులు కొనుగోలు చేసి వాటిని బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్నారు. తద్వారా అమాయకుల నుంచి లక్షల్లో డబ్బు గుంజుతున్నారు. రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఈ అక్రమాలు బయటపడ్డాయి.

covifore tablets selling in black market
బ్లాక్​లో కోవిఫోర్​ మందుల విక్రయం

By

Published : Apr 28, 2021, 2:12 PM IST

కరోనా బాధితులను ఆసరాగా చేసుకొని కొన్ని మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు బ్లాక్​లో మందులు, ఇంజక్లన్ల అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధి బోడుప్పల్​లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. అన్నపూర్ణ కాలనీలోని ఓ మందుల​ దుకాణంలో కోవిఫోర్‌ ఇంజక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో.. ఎస్‌వోటీ బృందం, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహాయంతో మెడికల్‌ దుకాణంపై పోలీసులు దాడి చేశారు.

మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న కుతాది అంజన్‌కుమార్‌, దుకాణం యాజమాని కటసాల భాస్కర్‌రావును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అంజన్‌కుమార్‌ కోఠిలో కోవిఫోర్‌ మెడిసిన్‌ను ఎంఆర్‌పీ ధర రూ.3,490కు కొనుగోలు చేసి దుకాణం యాజమానికి రూ.28 వేలు చొప్పున అమ్ముతున్నాడు. దానిని కొవిడ్‌ బాధితులకు రూ.30వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ అంజిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details