ప్రాణాంతక వైరస్ సోకింది... ప్రాణం నిలుస్తుందన్న గ్యారంటీ లేదు. బతికుండి అయినోళ్లకు భారం కాకూడదు. ఆరోగ్యం విషమించి ఉక్కిరిబిక్కిరై ఊపిరొదలకూడదు. ఇలా కకావికలమైన మనసుకు అపోహలు తోడై..... మనసులో రేగిన కల్లోలం కొవిడ్ బాధితుడిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. సిగ్నల్ పడగా కదులుతున్న బస్సు చక్రంకింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సూర్యనగర్కు చెందిన కాంపెల్లి శ్రీనివాస్ గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిగ్నల్ వద్ద ఆగిఉన్న బస్సు వెనుక చక్రం వద్ద నిలబడిన శ్రీనివాస్ సిగ్నల్ పడగానే చక్రం కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.