కరోనా సోకిన వ్యక్తికి చికిత్స చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. నాలుగు రోజులుగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కొరత ఉందంటూ వైద్యం చేయకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. కామారెడ్డికి చెందిన లక్ష్మణ్‌కు కరోనా సోకడంతో ఈ నెల 14న సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
కరోనాతో వ్యక్తి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో కొవిడ్ రోగి మృతి
కరోనా చికిత్స తీసుకుంటున్న వ్యక్తి మృతి చెందడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. లక్ష రూపాయల ఇంజక్షన్ కొనుగోలు చేసి వైద్యులకు ఇచ్చామని మృతుని కుటుంబసభ్యులు తెలిపారు.
కరోనాతో వ్యక్తి మృతి
కొవిడ్ రోగికి వైద్యం చేయడానికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కొరత ఉందని వైద్యులు చెప్పడంతో తాము రూ.25 వేలకు బ్లాక్‌లో కొనుగోలు చేసి ఇచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న రూ.లక్ష రూపాయల విలువ చేసే యాక్టమెరా ఇంజక్షన్‌ను ఆస్పత్రి వైద్యులకు అందించామని మృతుని బంధువులు వివరించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను నిలదీయడంతో రోగి మరణించాడని.. మృతదేహాన్ని తీసుకువెళ్లాలని ఆస్పత్రి యజమాన్యం చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.