Suicide : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ రోగి ఆత్మహత్య - covid patient suicide in warangal
11:24 July 30
COVID PATIENT SUICIDE : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ రోగి ఆత్మహత్య
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలోని రెండో అంతస్తుపై నుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంజీఎంలోని కరోనా వార్డులో అతడు చికిత్స పొందుతున్నాడు.
గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 24న వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. మరుసటి రోజు కొవిడ్ నిర్ధారణ కావడం వల్ల ఎంజీఎం ఆస్పత్రిలోని కరోనా విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఎంతకీ వ్యాధి లక్షణాలు తగ్గకపోవడం వల్ల మనస్తాపానికి గురైన బాధితుడు ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.