సైబర్ నేరగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. కొవిడ్ ఇంజక్షన్ల పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు కాజేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌కు చెందిన బాధితుడు.. కొవిడ్ ఇంజక్షన్లు తక్కువ ధరకు వస్తున్నాయని తెలుసుకుని ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. నకిలీ వెబ్సైట్లో ఉన్న నంబర్‌కు కాల్ చేసి బేరమాడాడు. వారు చెప్పిన బ్యాంకు అకౌంట్లోకి రూ. 2 లక్షలు వేశాడు.
ఇంజక్షన్లు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బెంగుళూరులో ఉన్న జాఫ్ డేక్లాన్, మథియస్ ఏషా అనే ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కి తరలించారు.