ఓటుకు నోటు కేసులో స్వాధీనం చేసుకున్న సీడీలు, హార్డ్ డిస్కులు సమర్పించాలని అవినీతి నిరోధక శాఖను కోర్టు ఆదేశించింది. ఇవాళ.. అనిశా న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. సాక్షుల విచారణ ప్రక్రియకు షెడ్యూలు ఖరారు చేసేందుకు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
'ఓటుకు నోటు కేసులో సీడీలు, హార్డ్ డిస్కులు సమర్పించండి' - vote for note case latest updates
ఓటుకు నోటు కేసులో అనిశా స్వాధీనం చేసుకున్న సీడీలు, హార్డు డిస్కులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యాల విచారణ ప్రక్రియ షెడ్యూల్ ఖరారుచేసేందుకు విచారణను వాయిదా వేసింది.
'ఓటుకు నోటు కేసులో సీడీలు, హార్డ్ డిస్కులు సమర్పించండి'
ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సహా నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తో పాటు ఐపీసీ 120బి రెడ్ విత్ 34 ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై గతంలోనే అభియోగాలు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్సింహా, సెబాస్టియన్లపై కలిపి విచారణ చేపట్టాలని అనిశా న్యాయస్థానం నిర్ణయించింది.