కలకలం రేపుతోన్న వృద్ధ దంపతుల హత్య, రేకెత్తుతున్న పలు అనుమానాలు - Couples Murder news
Couples Murder మెదక్ జిల్లాలో కొల్చారం మండలం పైతర గ్రామంలో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపుతోంది. ఈ హత్యలు దొంగలు చేశారా..? లేక పాత కక్షలతో ఎవరైనా చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Couples Murder: మెదక్ జిల్లాలో కొల్చారం మండలం పైతర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిమ్మన్నగారి లక్ష్మమ్మ(52), లక్ష్మారెడ్డి(55) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి ఆవరణలో లక్ష్మమ్మ మృతదేహం ఉండగా.. కొద్ది దూరంలోని పశువుల కొట్టంలో లక్ష్మారెడ్డి మృతదేహం ఉంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యలు దొంగలు చేశారా..? లేక పాత కక్షలతో ఎవరైనా చేశారా..? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మెదక్ డీఎస్పీ సైదులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.