పంటను కాపాడుకునేందుకు వెళ్లిన దంపతులను పిడుగు రూపంలో మృత్యువు వెంటాడింది. జొన్నపంటను రక్షించుకునేందుకు పొలానికి వెళ్లగా ఇద్దరు పిడుగుపాటుకు గురై మరణించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మనూరు తండాలో జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఈ ఘటనతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
పిడుగుపాటుకు దంపతుల మృతి... అనాథలుగా మారిన పిల్లలు - మనూరుతండాలో దంపతులు మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై దంపతులు మృత్యువాత పడ్డారు. పంటను కాపాడుకునే ప్రయత్నంలో ప్రకృతి వారిని కబళించింది. ఈ ఘటనతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
పిడుగుపాటుకు దంపతుల మృతి.
మనూరు తండాకు చెందిన కిషన్ నాయక్(40), కొమిని బాయి (35 ) దంపతులు కోత కోసిన జొన్న పంటను కాపాడుకునేందుకు పొలానికి వెళ్లారు. వర్షంలో ధాన్యం తడిసి పాడవుతుందని టార్పాలిన్ కవర్లు కప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పిడుగుపాటుకు గురై దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.