ఏపీలోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామానికి చెందిన అనిల్.. జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదే కంపెనీలో పని చేస్తున్న రాయగఢ్ ప్రాంతానికి చెందిన స్వప్నతో అనిల్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరి మధ్య గొడవలు తలెత్తాయి. అప్పటినుంచి స్వప్న నందిగామలో నివాసముంటోంది. ఈ ఘటనపై అనిల్ కుమార్.. చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. స్వప్న నందిగామ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
SUICIDE ATTEMPT: పోలీస్ స్టేషన్ ఎదుటే దంపతుల ఆత్మహత్యాయత్నం - krishna district latest news
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం కలిసుండాలని కలలుగన్నారు. వారి మధ్య తలెత్తిన చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోయారు. సయోధ్య కుదుర్చుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంపై మనస్తాపం చెందారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు, పోలీసులు చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు.
పరస్పర ఫిర్యాదులతో.. అనిల్, స్వప్నలను ఇవాళ పెద్ద మనుషుల సమక్షంలో నందిగామ ఠాణాకు తీసుకువచ్చారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన స్వప్న.. పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన అనిల్.. స్వప్న చేతిలో ఉన్న డబ్బాను తీసుకొని తాగాడు. అప్రమత్తమైన పోలీసులు.. బంధువుల సహాయంతో ఇద్దరినీ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.
ఇదీచూడండి:dead body in refrigerator: ఫ్రిజ్‌లో 93 ఏళ్ల వృద్ధుడి మృతదేహం