మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఎంకేపల్లి గ్రామ శివారులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలోని బండరాయిని ఢీకొని దంపతులు మృతి చెందారు.
హవేలీ ఘన్పూర్ మండల పరిధిలోని జక్కన్నపేట గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(49), బుజ్జమ్మ (42) దంపతులు మండల కేంద్రమైన టేక్మాల్ గ్రామంలో తమ సమీప బంధువు అంతక్రియలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎంకేపల్లి శివారులో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలోని పెద్ద బండరాయిని ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.