తెలంగాణ

telangana

ETV Bharat / crime

దైవదర్శనానికి వెళ్లి దంపతులు మృతి - మడికి వద్ద రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న భార్యాభర్తలను.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులను రంగంపేట మండలం దొడ్డిగుంటకు చెందిన తోట వీరబాబు, వరలక్ష్మిగా గుర్తించారు.

couple died, ap crime news
దైవదర్శనానికి వెళ్లి దంపతులు మృతి

By

Published : Apr 12, 2021, 3:05 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఈ అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో.. దంపతులు మరణించారు. మృతులను రంగంపేట మండలం దొడ్డిగుంటకు చెందిన తోట వీరబాబు (25), తోట వరలక్ష్మి (22) గా గుర్తించారు. బాధితుల బైక్​ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

చింతలూరులోని శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని.. ద్విచక్ర వాహనంపై తిరిగి దొడ్డిగుంటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్సై, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. వాహనం ఆచూకీ కోసం జాతీయ రహదారిపైన ఉన్న అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:పరిహారం ఇవ్వట్లేదని.. ఆటోకు నిప్పంటించాడు

ABOUT THE AUTHOR

...view details