తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident: రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం - మహబూబాద్ జిల్లా తాజా నేర వార్తలు

Road Accident: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్యభర్తలు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

By

Published : Jun 8, 2022, 7:33 PM IST

Road Accident: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మాడురు గ్రామ శివారు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాముల తండాకు చెందిన భూక్య స్వామి, క్రాంతి దంపతులు ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. నాంచారి మాడురు గ్రామ శివారు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం బైక్​ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details