నల్గొండ జిల్లా నిడమనూరులో లారీ బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడ నుంచి దేవరకొండ వైపు అతివేగంతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పడం వల్ల.. ఇద్దరు పిల్లలతో సహా తిప్పలమడుగు సర్పంచ్ దంపతులు మృతి చెందారు.
బియ్యం లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టి సుమారు 40 అడుగుల దూరం లాక్కెళ్లింది. ఇంతలో బైక్పై కుటుంబంతో కలిసి ముప్పారం వెళ్తున్న తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీను బైక్ను కూడా ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం లారీ కిందకు దూసుకెళ్లడం వల్ల శ్రీను లారీ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఆయన భార్య విజయ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.