husband killed wife: పెళ్లయిన కొద్ది రోజులకే అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఆమెను చంపేశాక పోలీసులకు ఎలాగూ దొరుకుతాను.. శిక్ష తప్పదని భావించాడో ఏమో.. తానూ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పెళ్లయినా కొద్ది రోజులకే భార్య ఉసురు తీసిన అనుమానం.. ఆపై తానూ.. - భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
husband killed wife: ఆలూమగల అన్యోన్య దాంపత్యానికి నమ్మకం, ప్రేమ పునాది. వాటిలో ఏది కొరవడినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. చివరికి అది ఎలాంటి పరిణామాలకైనా దారి తీసే అవకాశం ఉంది. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా హనుమకొండ జిల్లాలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను చంపి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తల్లా హరీష్ అనే యువకుడికి.. తూర్పు గోదావరి జిల్లా ఏటపాక మండలం గౌరీదేవిపేట గ్రామానికి చెందిన పుష్పలీల తో జూన్ 17వ తేదీన వివాహం జరిగింది. అప్పటి నుంచే భార్యపై అనుమానం కలగడంతో.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు చోటుచేసుకున్నాయి. అలా నిత్యం పుష్పలీలను వేధించిన భర్త పెళ్లయిన 20 రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రి నుంచి వచ్చాక మరింత అనుమానం పెంచుకొని.. నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరు లేనిది చూసి కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: