తెలంగాణ

telangana

ETV Bharat / crime

అబ్దుల్లాపూర్ మెట్‌ వద్ద ప్రమాదం, దంపతులు మృతి

ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదం అబ్దుల్లాపూర్​ మెట్​ వద్ద చోటు చేసుకుంది. మృతులు డిటెక్టివ్ ఇన్​స్పెక్టర్ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

couple-died-in-accident-at-abdullapurmet
అబ్దుల్లాపూర్ మెట్‌ వద్ద ప్రమాదం, దంపతులు మృతి

By

Published : May 8, 2021, 6:56 AM IST

Updated : May 8, 2021, 10:04 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో దంపతులు మృతిచెందారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా... ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుడు లక్ష్మణ్‌ సుల్తాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

మృతుడు లక్ష్మణ్

లక్ష్మణ్‌ భార్య ఝాన్సీ వాహనం నడుపుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడని... అతను సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:ప్రతిధ్వని: కొలువు పోవడానికి కొవిడ్​ ఎంతవరకు కారణం..?

Last Updated : May 8, 2021, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details