couple died with current shock: సంగారెడ్డి చౌటకూరు మండలం వెండికోల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన విషయం రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణ్‌రావు అనే వ్యక్తి ఫామ్‌హౌస్‌లో ఏపీలోని విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం సురావరానికి చెందిన బిక్కిన శ్రీనివాస్.. అతడి భార్య దేవీ పనిచేస్తున్నారు. అదే ఫామ్‌హౌస్‌లో రేకులతో నిర్మించిన ఇంట్లో వాళ్లు నివాసముంటున్నారు.
స్నానానికి వెళ్తూ టవల్ తీసుకునే క్రమంలో..
రోజూ మాదిరిగానే ఈ నెల 16న సాయంత్రం పూట.. చేనులో పని ముగించుకొని ఇంటికి వచ్చిన శ్రీనివాస్ స్నానానికి సిద్ధమయ్యాడు. ఇంట్లో బట్టల కోసం ఇనుప వైర్‌తో కట్టిన దండెం మీద ఉన్న టవల్‌ను తీస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా కిందపడిపోయాడు. శ్రీనివాస్ అరుపులు విన్న భార్య దేవి.. అతడ్ని రక్షించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దేవి కూడా కరెంట్‌షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.
కుక్కల అరుపులతో రెండు రోజుల తర్వాత..
ఫామ్‌హౌస్‌లోకి ఎవరూ వెళ్లకపోవటం వల్ల.. ఈ విషయం బయటపడలేదు. 18న సాయంత్రం కుక్కలు తీవ్రంగా అరవటం వల్ల.. పక్కన చేనులో పనిచేసే కూలీలకు అనుమానం వచ్చింది. వెంటనే గ్రామ సర్పంచ్‌కు విషయాన్ని తెలపగా.. ఈ విషాదం వెలుగుచూసింది. పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్తలిద్దరు మృతి చెందడం వల్ల వారి పిల్లలు అనాథలయ్యారు.
ఇదీ చూడండి: