భర్తను కాపాడబోయి తనువు చాలించిన భార్య.. ఏమైంది..? - అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి
Couple dead: రోజు మాదిరిగానే ఆ వైరుపై బట్టలు ఆరేస్తున్నారు. కానీ ఊహించని విధంగా విద్యుత్ షాక్ తగిలింది. భర్తను కాపాడేందుకు వెళ్లి భార్య సైతం విద్యుత్‌షాక్‌కు గురైంది. స్థానికులు అంబులెన్స్‌కు కాల్ చేసినా.. ఆలస్యంగా రావడంతో దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
Couple dead: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో విషాదం నెలకొంది. విద్యుత్ సర్వీస్ వైర్‌పై దుస్తులు ఆరేస్తుండగా.. విద్యుత్‌షాక్‌తో దంపతులు మృతి చెందారు. భర్తను కాపాడే క్రమంలో భార్యకూ షాక్ కొట్టడంతో స్పృహ కోల్పోయారు. పరిస్థితిని గమనించిన స్థానికులు 108కి కాల్ చేశారు. కానీ అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఘటనాస్థలిలోనే భార్యాభర్తలు మరణించారు. అరకులోయలోని విద్యుత్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. దీనితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చదవండి: