Couples suicide: ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలిద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. గత రెండు రోజులుగా భూలక్ష్మి, కొండయ్య కనపడకపోవడంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో వారి కుమార్తె ఆశాజ్యోతి ఫిర్యాదు చేసింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో బొల్లారంలోని క్యావెలరి బ్యారక్స్ వద్ద ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Couples suicide: రైలు కిందపడి ఆర్మీ దంపతుల ఆత్మహత్య.. కారణమదే..! - బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
Couples suicide: అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కిందపడి బలవన్మరణం చెందారు. సికింద్రాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.
ఆర్మీలో సుబేదార్‌గా విధులు
army subedar: మృతుడు కొండయ్య తిరుమలగిరి ఆర్మీ రీజియన్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా అప్పులు ఎక్కువై ఆర్థిక సమస్యలతోనే భూలక్ష్మి, కొండయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దంపతుల కుమార్తె ఆశాజ్యోతి కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది.