తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య - మడకశిర తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్​లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం హెచ్‌.ఆర్‌.పాలెంలో చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

couple commits suicide by hanging a tree at ananthapuram
ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య

By

Published : Jun 2, 2021, 2:20 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర మండలం హెచ్‌.ఆర్‌.పాలెంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్‌.ఆర్‌.పాలెంలో చెట్టుకు ఉరేసుకుని.. యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మడకశిరలోని శివాపురం ప్రాంతానికి చెందిన వీరిద్దరూ.. గతంలో ప్రేమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరుగా వివాహాలయ్యాయి. అయినా పాత సంబంధం అలాగే కొనసాగించారని... ఈ విషయం తెలిసి పెద్దలు మందలించిన కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్సై శేషగిరి బృందం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చదవండి :భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details