తెలంగాణ

telangana

ETV Bharat / crime

దంపతుల ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ.5.5కోట్లు కుచ్చుటోపీ - చిట్టీల పేరుతో రూ5కోట్లు మోసం చేసిన దంపతులు అరెస్టు

Couple arrested for cheating Rs 5.5 crore in the name of Chits in hyderabad
Couple arrested for cheating Rs 5.5 crore in the name of Chits in hyderabad

By

Published : Jun 22, 2022, 7:07 PM IST

Updated : Jun 22, 2022, 7:36 PM IST

19:04 June 22

చిట్టీల పేరుతో రూ.5.5కోట్లు మోసం చేసిన దంపతులు అరెస్టు

హైదరాబాద్‌లో చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో లూటీ చేశారు దంపతులు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.5.5 కోట్లకు పైగానే వసూళ్లకు పాల్పడ్డారు. చివరకు అందరికి కుచ్చుటోపి పెట్టారు.

అసలేం జరిగిందంటే...చిట్టీల పేరుతో ఐదున్నర కోట్ల రూపాయలు మోసం చేసిన ఓ దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు వారు ఆందోళన దిగారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ ప్రాంతానికి చెందిన మధు, భార్య దివ్య... ఆరు సంవత్సరాల నుంచి చిట్టి వ్యాపారం చేస్తున్నారు. చిట్టీలు పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు 11 నెలల క్రితం శాలిబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు సీసీఎస్‌కు బదిలీ కావడంతో 11 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్న దంపతులను బుధవారం సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిరు వ్యాపారాలు చేస్తున్న తాము తన బిడ్డల పెళ్లిళ్లకు, చదువుల కోసం... మధు వద్ద 50 వేల నుంచి ఐదు లక్షల వరకు చిట్టీలు వేసినట్లు బాధితులు తెలిపారు. సుమారు 70 మంది నుంచి రూ 5.5 కోట్లు దండుకునట్లు... అంతే కాకుండా చిట్టీ గడువు పూర్తి అయిన్నప్పటికీ... డబ్బులు చెల్లించకుండా అధిక వడ్డీ ఆశ చూపి ఆ డబ్బులను కూడా స్వాహా చేశారని బాధితులు వాపోయారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 22, 2022, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details