నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాడ్గుల మండలం పాత బ్రాహ్మణపల్లికి చెందిన వెంకటయ్య వినాయక ట్రేడర్స్ పేరుతో విత్తనాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. తన దుకాణంలో గడువు తీరిన పత్తి విత్తనాలతో పాటు.... నిబంధనలకు విరుద్ధంగా పత్తి ప్యాకెట్లను నిల్వ చేసుకున్నాడు.
Fake seeds: నకిలీ విత్తనాల వ్యాపారి అరెస్ట్.. - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
కల్తీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. 43లక్షల విలువ చేసే 2835 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లను సీజ్ చేశారు.
FAKE SEEDS
పక్కా సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. మాడ్గుల పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. స్థానిక వ్యవసాయ శాఖాధికారికి సమాచారం ఇచ్చారు. దాదాపు 25వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే విత్తనాలు వినాయక ట్రేడర్స్‌లో బయటపడ్డాయి. 43లక్షల విలువ చేసే 2835 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లను సీజ్ చేశారు.
ఇదీచూడండి: BLACK MARKET: బ్లాక్‌ఫంగస్ డ్రగ్‌ను అమ్ముకున్న ప్రభుత్వ వైద్యుడు