Councilor Son attack: ఆదిలాబాద్లో ఇరువర్గాల మధ్య గొడవ కలకలం సృష్టించింది. పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన వార్టు కౌన్సిలర్ తనయుడు ఆనంద్ తన అనుచరులతో వీరంగం సృష్టించారు. అదే కాలనీకి చెందిన దివ్యాంగుడితో పాటు.. మరో వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో కేఆర్కే కాలనీలో పోలీసు బలగాలను మోహరించారు. కాలనీ సమీపంలోని దుకాణాలను పోలీసులు మూసి వేయించారు. మొదట కౌన్సిలర్ తనయుడిపై మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుకాగా.. ఆయన కూడా మరో వర్గంపై ఫిర్యాదు చేశారు. దీంతో రెండువర్గాలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు కౌన్సిలరు తనయుడి దాడిలో గాయపడ్డ వ్యక్తి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనితో కాలనీలో ఘర్షణ వాతావరణం నెలకొంది.