ఖమ్మం జిల్లా గోవిందు తండాలో హోలీ వేడుకల్లో ఈతకు వెళ్లిన భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన మాలోత్ శివ శంకర్(25) మృతి చెందాడు. మిత్రులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆ యువకుడు.. స్నానం కోసం బావిలో దిగాడు. ఈ తరుణంలో అతను మునిగిపోతున్న విషయాన్ని గమనించిన కొందరు పిల్లలు.. అతనికి ఈత రాదని గ్రహించి కేకలు వేస్తూ కాపాడే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వచ్చి గాలించగా యువకుడి మృతదేహం లభ్యమైంది. బావి లోతు అంచనా వేయకపోవడం, యువకుడికి ఈత రాకపోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఈత రాకున్నా బావిలోకి దిగి మృతి - a person died at holi time
హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈత రాకున్నా ఓ యువకుడు బావిలోకి దిగాడు. ఈ క్రమంలో జలకాలాడుతూ మరణించాడు. పలువురు ప్రయత్నించినప్పటికీ అతనిని కాపాడలేక పోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

ఈత రాకున్నా బావిలోకి దిగి మృతి
ఇదీ చూడండి :కూలీల వ్యానును ఢీకొట్టిన బస్సు- ఐదుగురు మృతి