మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకటాపురం శివారులోని సాంబ తాండ వాసులు... అటవీ ప్రాంతంలోని పోడు భూముల్లో డోజర్లతో సాగు చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడకు వెళ్లారు. వారినుంచి డోజర్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఫారెస్ట్ అధికారులకు కరోనా రోగుల జలక్ - కరోనా రోగులతో బెదిరించి
పోడు భూముల్లో డోజర్లతో సాగు చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. డోజర్లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎదురించిన తండావాసులు విఫలమయ్యారు. అధికారులను ఎలా అయినా అక్కడి నుంచి పంపించేయాలనుకున్న తండా వాసులు ఆఖరు అస్త్రంగా కరోనా రోగులను రంగంలోకి దించారు.
'మీ దగ్గర అధికారముంటే... మా దగ్గర కరోనా రోగులున్నారు'
ఎదురించిన తండా వాసులు విఫలమయ్యారు. చివరకు కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉన్న బాధితులను తండా నుంచి ఘటనాస్థలానికి రప్పించారు. దీంతో భయపడిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చూడండి:యమ డేంజర్: రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..!
Last Updated : Apr 23, 2021, 11:15 AM IST