కొవిడ్ బాధితులకు ఉపయోగపడే ఇంజక్షన్ల బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది. కొవిఫోర్ ఇంజక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రాం చందర్, కోలమ కార్తిక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని మెడికల్ దుకాణం యాజమాని శీను కలిసి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.
బ్లాక్‌లో కొవిఫోర్ విక్రయం.. నిందితులు అరెస్ట్ - corona injections selling in black marketing
కొవిడ్ బాధితులకు ఉపయోగపడే ఇంజక్షన్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
బ్లాక్ మార్కెటింగ్‌లో కరోనా మందుల విక్రయం
ఒక్కో ఇంజక్షన్‌ను ఎంఆర్పీ ధర రూ.3,490కి కొనుగోలు చేసి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు రూ.35 వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి సీఐ బి.అంజిరెడ్డి తెలిపారు. వారి నుంచి మూడు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ వినియోగానికి అనుమతి