తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆత్మహత్యకు పాల్పపడిన కరోనా బాధితుడు

నల్గొండ జిల్లా చామలపల్లిలో కరోనా సోకిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యభర్తలకు కరోనా వైరస్ సోకగా హోం ఐసోలేషన్​లో ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

farmer
farmer

By

Published : May 23, 2021, 2:54 PM IST

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చామలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడ్డటి వెంకన్న, సాయమ్మ భార్యభర్తలు. మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా వారికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. భార్యాభర్తలు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. మనస్తాపానికి గురైన వెంకన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళ్ల ముందే భర్త చనిపోవడం వల్ల భార్య బోరున విలపించింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details