కరోనా రోగులకు సేవలందిస్తూ అదే వైరస్ బారినపడి ఎంతో మంది వైద్యసిబ్బంది అసువులు బాస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరి బాధితులకు అండగా నిలుస్తున్న వారు మహమ్మారికి బలైపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని నీలోఫర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్స్ వైరస్ బారిన పడి మృతి చెందారు.
కరోనా బారినపడి నీలోఫర్ ఆస్పత్రి హెడ్నర్స్ మృతి - corona effect on medical staff in Hyderabad
కరోనా బాధితులకు నిత్యం సేవలందిస్తూ మహమ్మారి బారిన పడి వైద్యసిబ్బంది ప్రాణాలొదులుతున్నారు. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని నీలోఫర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్స్ వైరస్ బారినపడి మృతి చెందారు.
వైద్య సిబ్బందిపై కరోనా ప్రభావం, వైద్య సిబ్బందిపై కరోనా ఎఫెక్ట్, కరోనాతో నీలోఫర్ హెడ్నర్స్ మృతి
నీలోఫర్ ఎమర్జెన్సీ వార్డులో.. హెడ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న స్వరూపరాణి.. గతవారం పాజిటివ్ రావడం వల్ల ఆస్పత్రిలో చేరారు. సైఫాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నీలోఫర్‌లో ఇప్పటికే.. దాదాపు 60 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.